పుట:Oka-Yogi-Atmakatha.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

543

“ ‘లాహిరీ,[1] వచ్చేశావా!’ అంటూ ఆ సాధువు, నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ‘ఈ గుహలో విశ్రాంతి తీసుకో. నిన్ను పిలిచినవాణ్ణి నేనే.’ ”

“పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను; దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళూ కొన్ని కమండలాలూ ఉన్నాయి.”

“లాహిరీ, ఆ ఆసనం జ్ఞాపకముందా నీకు?’ అంటూ ఆ యోగి, ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడివేపు చూపించారు.”

“ ‘లేదండి,’ నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మతుణ్ణి అయి, “నే నిప్పుడు చీకటిపడే లోగా వెళ్ళిపోవాలండి. పొద్దున ఆఫీసులో నాకు పని ఉంది,’ అన్నాను.”

“ఆ విచిత్ర సాధువు ఇంగ్లీషులో జవాబిచ్చారు. ‘ఆఫీసును రప్పించింది నీ కోసం కాని, నిన్ను ఆఫీసుకోసం కాదు.’ ”

“ఈ వనవాసి సాధువు ఇంగ్లీషు మాట్లాడ్డమే కాకుండా, క్రీస్తు[2] మాటల్ని అన్వయించి చెప్పడం విని నేను మూగబోయాను.

  1. నిజానికి బాబాజీ లాహిరీ మహాశయుల్ని పిలిచింది, “గంగాధర్” అన్న పేరుతో; అది ఆయనకి పూర్వజన్మలో ఉన్న పేరు. గంగాధరుడు (అంటే, “గంగను ధరించినవాడు”) శివదేవుడి పేర్లలో ఒకటి. పురాణ కథలో చెప్పినట్టు, పావనగంగ స్వర్గం నుంచి అవతరించింది. దాని ఉద్ధృత అవతరణ ధాటికి భూమి తట్టుకోడానికి శివుడు గంగను తన జటాజూటంలో బంధించి, అక్కణ్ణించి అనుకూల ప్రవాహంగా భూమి మీదికి వదలడం జరిగింది. “గంగాధర” శబ్దానికున్న అధిభౌతిక ప్రాముఖ్యం ఏమిటంటే వెన్నులో ఉన్న ప్రాణప్రవాహమనే “నది”ని అధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం.
  2. “సబత్ (విశ్రాంతి దినం) మనిషికోసం ఏర్పాటయింది కాని, మనిషి సబ్బత్ కోసం కాదు.” -(మార్కు 2 : 27 )