పుట:Oka-Yogi-Atmakatha.pdf/572

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

536

ఒక యోగి ఆత్మకథ

మెల్లగా లేచినప్పుడు, దానికింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది. ఏ అజ్ఞాత సాధనంవల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తరవాత, ఆశ్చర్యం కలిగించేటంత అందమయిన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం, ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువయిన కాంతి పరివేషం గోచరిస్తూ ఉండగా ఆమె, మెల్లగా నేలకు దిగివచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరి కామె కదిలి మెల్లగా ఇలా అన్నారు:

“ ‘నేను మాతాజీని[1] - బాబాజీ చెల్లెల్ని. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్నీ లాహిరీ మహాశయుల్నీ నా గుహదగ్గరికి రమ్మని కోరాను.’ ”

“ఇంతలో, వెండిమబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిని తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ళమీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది. అది దగ్గరికి వచ్చి వచ్చి, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులయి నమస్కరించారాయన.

“నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్య పోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం, మా సమూహానికి దగ్గరిగా వచ్చి ఒక అందమయిన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయనే

  1. “పవిత్ర మాత.” మాతాజీ కూడా అనేక శతాబ్దాలుగా జీవిస్తూన్నారు. ఆధ్యాత్మికంగా ఈమె, దాదాపు సోదరులందుకున్నంత ఉన్నత స్థితిని అందుకున్నారు. దశాశ్వమేధ ఘట్టం దగ్గర భూమిలో ఉన్న ఒక రహస్య గుహలో ఆనందపారవశ్యంలో మునిగి ఉంటారు.