పుట:Oka-Yogi-Atmakatha.pdf/571

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

535

చెబుతూ, పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు - ఇది కేవలం మానవ శ్రేయస్సుకోసం. క్రీస్తు కూడా ఇలా అన్నాడు: “తండ్రీ , నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు; కాని నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను.” (యోహాను 11 : 41-42).

రణబాజ్‌పూర్‌లో, “నిద్రపోని సాధువు”[1] అయిన రామగోపాల్ మజుందార్‌గారిని సందర్శించిన సందర్భంలో ఆయన, బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు.

‘కాశీలో లాహిరీ మహాశయుల పాదసన్నిధిలో కూర్చోడం కోసం ఒక్కొక్కప్పుడు నేను, ఏకాంతగుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి, అన్నారు రామగోపాల్‌గారు నాతో. “ఒకనాడు నడిరాత్రివేళ వారి శిష్య బృందంతో బాటు కూర్చుని ధ్యానం చేసుకొంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమయిన కోరిక ఒకటి కోరారు.

“ ‘రామగోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు,’ అన్నారు లాహిరీ మహాశయులు”

“వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ వెన్నెలతోను, మిలమిల మెరిసే చుక్కలతోను ప్రకాశిస్తున్నది. కొంత సేపు ఓపికగా, మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరిలోనే ఉన్న ఒక పెద్ద రాతిపలక మీద నా చూపు నిలిచింది. అది మెల్ల

  1. తారకేశ్వర ఆలయం ముందు నేమ తలవంచలేదని గమనించిన సర్వవ్యాపి యోగిపుంగవులు (అధ్యాయం 13).