పుట:Oka-Yogi-Atmakatha.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 33

ఆధునిక భారతీయ యోగీశ్వరులు

బాబాజీ

బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమగిరి శిఖర ప్రాంతం, బాబాజీ ఉనికితో ఈనాటికీ పునీతమవుతున్నది. బాబాజీ లాహిరీ మహాశయుల గురుదేవులు. ఏకాంతవాసు లయిన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా - బహుశా అనేక సహస్రాబ్దులుగా - తమ భౌతికరూపాన్ని నిలుపుకొంటున్నారు. మరణంలేని బాబాజీ అవతార పురుషులు. సంస్కృతంలో అవతరించడం అంటే, “కిందికి దిగడం” అని అర్థం. అవతార శబ్దంలో “అవ” అనే ఉపసర్గకు “కిందికి” అనీ, ‘తృ’ అనే ధాతువుకు “దాటడం” అనీ అర్థాలు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం, దైవం భౌతిక శరీరం రూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది.

“బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది,” అని నాకు వివరించా రొకసారి శ్రీయుకేశ్వర్‌గారు. “మానవుల కుంఠిత దృష్టి, ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థప్రయత్నమవుతుంది. అది అనూహ్యమైనది.”

ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశనూ ఉపనిషత్తులు సునిశితంగా వర్గీకరించాయి. సిద్ధుడు (“పరిపూర్ణత పొందినవాడు”) జీవన్ముక్త