పుట:Oka-Yogi-Atmakatha.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 3

రెండు శరీరాలున్న

సాధువు

“నాన్నగారూ, నన్నెవరూ బలవంతం చెయ్యకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే, కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా?”

ప్రయాణాలు చెయ్యడమంటే నాకున్న గాఢమైన అభిలాషకు, మా నాన్నగారు ఎప్పుడోకాని అడ్డుచెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలూ యాత్రాస్థలాలూ చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా, ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు; మేమందరం, మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే ప్యాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి, మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది.

నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు; బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాసు, కొన్ని రూపాయి నోట్లు, రెండు ఉత్తరాలు ఇచ్చారు.

“కాశీలో కేదార్‌నాథ్ బాబు అని, మా స్నేహితుడున్నాడు; అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు, అతని ఎడ్రసు