పుట:Oka-Yogi-Atmakatha.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

523

లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగవిద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణమది.

పురాణ కథలో దాహాతురుడైన భగీరథుడనే భక్తుడికోసం గంగ,[1]

  1. హిందువులకు పవిత్ర నది అయిన గంగామాత జలాలు, ఎప్పటికీ హిమాచ్చాదితమై ఉండి నిశ్శబ్దం ఆవరించిన హిమాలయాల్లోని ఒక మంచు గుహలో నుంచి పుడతాయి. అనేక శతాబ్దుల కాలంలో వేలాది సాధుసత్పురుషులు గంగకు సమీపంలో ఉండి ఆనందించారు; ఆ నదీ తీరాల వెంబడి వారు, శుభాశీస్సుల దివ్యప్రభ ఒకటి విడిచి వెళ్ళారు. గంగానది కున్న ఒకానొక అసాధారణ గుణం - బహుశా దాని కొక్కదానికే ఉన్న విలక్షణత. నిష్కల్మషత్వం, క్రిముల్ని బతకనివ్వకపోవడ మనే మార్పులేని లక్షణంవల్ల, దాంట్లో ఏ సూక్ష్మక్రిములూ బతకవు. అనేక లక్షల మంది హిందువులు, స్నానానికీ తాగడానికీ ఆ ఏటి నీళ్ళు వాడుతూనే ఉంటారు కాని, దానివల్ల వాళ్ళకి ఎటువంటి హానీ కలగదు. ఈ యథార్థం ఆధునిక శాస్త్రవేత్తలకు విస్మయం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఒకడు, డా. జాన్ హోవర్డ్ నార్త్రావ్ - 1946 లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో ఒకడు- ఇలా చెప్పాడు: “గంగానదిలో కాలుష్యాలు చాలా కలుస్తాయని మనకి తెలుసు. అయినా భారతీయులు దాంట్లో నీళ్ళు తాగుతారు; దాంట్లో ఈతలాడతారు; అయినా జబ్బుపడ్డం కనిపించదు.” అంటూ ఆయన, “బహుళా, జీవాణుభుక్కు (బాక్టీరియోఫేజ్ ) ఆ నదిని పరిశుద్ధం చేస్తూ ఉండొచ్చు,” నని ఆశాభావం వెలిబుచ్చాడు.

    ప్రాకృతిక దృగ్విషయాలన్నిటిపట్లా వేదాలు పూజ్యభావం పాదుకొలుపుతాయి. సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ, “ఎంతో ఉపయోగకరంగా, వినయంగా, పవిత్రంగా, అమూల్యంగా ఉన్న మన ‘సోదరి నీటి’ని సృష్టించినందుకు, ప్రభువుకు జయమవుగాక!” అంటూ కీర్తించడాన్ని భక్తినిరతుడై హిందువు చక్కగా అర్థం చేసుకుంటాడు.