పుట:Oka-Yogi-Atmakatha.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

516

ఒక యోగి ఆత్మకథ

శ్రీయుక్తేశ్వర్‌గారు ఈ అద్భుతకథ ముగించగానే, రాంచీ కుర్రవాళ్ళలో ఒకడు, ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. పైగా, ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వెయ్యడం ఇంకా సహజం.

“మహాశయా, మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపారండి?” అని అడిగాడు.

“అబ్బాయ్, ఆ చమురు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గరనుంచి భౌతిక మైనదేదో ఆశించినందువల్ల లాహిరీ మహాశయులు, నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొలపడానికి, వస్తురూపమైన చిహ్నంగా, దగ్గరిలో ఉన్న చమురును ఎన్నుకున్నారు. నేను కొంతవరకు శంకించినందువల్ల, ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు. కాని, మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చెయ్యవలసి వచ్చినా కూడా, గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగయి తీరాలని ఆయనకు తెలుసు!”

శ్రీయుక్తేశ్వర్‌గారు పిల్లకాయల్ని పంపేసి, నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగడి ఆసనం చూపించారు.

అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు, “యోగానందా, పుట్టినప్పటినించి నీ చుట్టూ, లాహిరీ మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆ మహాగురువులు, మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు; పైగా, తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికయినా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు.

“నేను పోయిన తరవాత సుమారు ఏభై ఏళ్ళకి, పడమటిదేశాల్లో