పుట:Oka-Yogi-Atmakatha.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

508

ఒక యోగి ఆత్మకథ

మీరు చేసుకోండి; ఏమంటే, సృష్టిలోని దివ్యసామరస్యాన్ని నిరూపించడానికి సాధుసజ్జనులేకాక రాళ్ళూ భూమీ నీరూ నిప్పూ గాలీ, మీ మీదికి విజృంభిస్తాయి.”

క్రీస్తువంటి యోగిపుంగవులైన త్రైలింగస్వామివారి దయ, ఒకసారి మా మేనమామ మీద ప్రసరించింది. ఒకనాడు పొద్దున మా మామయ్య, కాశీలో ఒక రేవులో భక్తబృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు. ఎలాగో దారి చేసుకుని గుంపులోకి చొరబడి త్రైలింగస్వామికి చాలాదగ్గరగా వెళ్ళి, సవినయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు. బాధాకరమైన తన మొండిరోగం నుంచి తక్షణమే విముక్తి కలగడం చూసి ఆశ్చర్య పోయాడు.[1]

ఈ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్టు తెలిసిన ఏకైక శిష్యురాలు, శాంకరీమాయి జీవ్. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయిన ఈవిడ, బాగా చిన్నప్పటినించి స్వామివారి తర్ఫీదు పొందారు. ఈవిడ నలభై ఏళ్ళ పాటు, వరసగా బదరీనాథ్, కేదారనాథ్, అమరనాథ్, పశుపతినాథ్ క్షేత్రాల దగ్గరి హిమాలయ గుహల్లో ఏకాంతంగా నివసించారు. 1826 లో పుట్టిన ఈ బ్రహ్మచారిణికి ఇప్పుడు నూరేళ్ళకి మించి ఉంటాయి. అయినా ఈవిడ, వయస్సు పైబడినట్టు కనిపించరు; నల్లటి జుట్టూ ముత్యాలవంటి పలువరసా ఆశ్చర్యకరమైన దార్ఢ్యమూ నిలుపు

  1. త్రైలింగస్వామి, తదితర సిద్ధపురుషుల జీవితాలు మనకు ఏసుక్రీస్తు మాటల్ని జ్ఞాపకం చేస్తాయి. “నమ్మేవాళ్ళనే ఈ సూచనలు అనుసరించి వస్తాయి: నా పేరు [కూటస్థ చైతన్యం] మీద వాళ్ళు దెయ్యాల్ని విడిపిస్తారు, వాళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు: పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, వాళ్ళు ప్రాణాంతకమైనది ఏది తాగినా, అది వాళ్ళకి హాని చెయ్యదు: వాళ్ళు జబ్బు మనుషుల మీద చేతులు వేస్తారు, వాళ్ళు కోలుకుంటారు.” మార్కు 16 : 17-18 (బైబిలు).