పుట:Oka-Yogi-Atmakatha.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

507

చూసి విస్మయం చెందకుండా, తమ జీవితాల్లో విషమఘటనా పరంపరను నడిపిస్తారు; చివరికది వాళ్ళని, జ్ఞానాన్వేషణకు నిర్భంద పెడుతుంది.

ఆధ్యాత్మిక నియమానికున్న సర్వశక్తిమత్వాన్ని ఏసుక్రీస్తు, తాను జెరూసలెంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడు. ఆయన శిష్యులూ జనబాహుళ్యమూ ఆనందనినాదం చేస్తూ, “స్వర్గానికి శాంతి, సర్వోన్నతుడికి శోభ” అంటూ అరిచినప్పుడు కొందరు ఫారిసీలు (ఛాందస పురోహితులు), హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు. “స్వామీ, మీ శిష్యులికి చివాట్లు పెట్టండి,” అన్నారు.

కాని ఏసుక్రీస్తు జవాబిస్తూ, తన శిష్యుల నోళ్ళు నొక్కేటట్లయితే, “తక్షణమే రాళ్ళు అరుస్తాయి”[1] అన్నాడు.

ఫారిసీల్ని ఇలా మందలించడంలో ఏసుక్రీస్తు, దైవీన్యాయం కేవలం ఒక ఆలంకారిక కల్పనకాదనీ, సాధుప్రవృత్తిగల వ్యక్తి నాలికని మొదలంటా చీల్చేసినప్పటికీ, సృష్టికి ఆధారభూతమైన విశ్వవ్యవస్థలోనే ఆయన మాట వినవస్తుందని ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు.

ఏసుక్రీస్తు ఇలా అన్నాడు: “సాధువర్తనుల నోళ్ళు మూయించాలనుకుంటున్నారా? అంతకన్న, ఎవరి మహిమనూ సర్వవ్యాపకత్వాన్నీ రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నులిమెయ్యాలని ఆశించండి మీరు. స్వర్గంలో, శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకో గూడదంటారా ? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తంచేసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తారా? అయితే ఓ ఫారిసిల్లారా, భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు

  1. లూకా 19 : 37-40.