పుట:Oka-Yogi-Atmakatha.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

506

ఒక యోగి ఆత్మకథ

త్రైలింగస్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి చల్లగా జారుకున్నాడు.

బాధ తిరుగుముఖం పట్టడం, ఆ యోగి సంకల్పంవల్ల కాక, సృష్టి సుదూరతమ గోళాన్ని సైతం పరిచాలనం చేసే ధర్మసిద్ధాంతం[1] పని చెయ్యబట్టి జరిగింది. త్రైలింగస్వామి మాదిరిగా దైవసాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవనియమం పనిచేయడం తక్షణమే జరుగుతుంది; ఆ వ్యక్తులు అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నిటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు.

ధార్మికత కుండే స్వయంచాలితమైన సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే (త్రైలింగస్వామిని చంపబోయినవాడి విషయంలో మాదిరిగా, తరచుగా అనుకోని విధంగా ప్రతిఫలమిస్తూ) మానవ అన్యాయంపట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమింపజేస్తుంది. “ప్రతీకారం నాది; నేను తీర్చుకుంటాను, అంటాడు ప్రభువు,”[2] మానవుడి క్షుద్ర సాధనాల అవసర మేమిటి? తిరుగుదెబ్బ తియ్యడానికి విశ్వమే సరిగా పన్నాగం పన్నుతుంది.

దైవన్యాయం, ప్రేమ, సర్వజ్ఞత్వం, అమరత్వం అన్న వాటికి గల అవకాశాన్ని మందబుద్ధులు నమ్మరు. “ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు!” ఇలాటి అవివేక దృష్టిగల మనుషులు, బ్రహ్మాండదృశ్యాన్ని

  1. పోల్చి చూడండి, || కింగ్స్ 2 : 19-24 (బైబిలు). జెరీఖోలో ఎలిషా, “జలశోధన” (హీలింగ్ ది వాటర్స్) అనే అలౌకిక అద్భుత చర్య ప్రదర్శించిన తరవాత కొందరు పిల్లలు ఆయన్ని హేళనచేశారు. “అప్పుడు అడవిలోంచి రెండు ఆడ ఎలుగుబంట్లు - చొరబడి వచ్చి (వాళ్ళలో) నలభై (మీద) ఇద్దరు పిల్లల్ని చీల్చేశాయి.”
  2. రోమన్స్ 12 : 19 (బైబిలు),