పుట:Oka-Yogi-Atmakatha.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

503

వీథుల్లో తిరుగుతూ ఉంటే, కొన్ని దశాబ్దుల కిందట త్రైలింగస్వాములు కాశీలో జనసమ్మర్థంగల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యమూ ఇప్పుడు కలుగుతుంది. కాల (ప్రవాహం) కోతలకు గురికాకుండా భారత (తీర) దేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో ఆయన ఒకరు.

ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషాలు తాగడం, అయినా దుష్ఫలితాలు కలక్కపోవడం చూశారు జనం. ఆయన గంగానది మీద తేలుతూ ఉండడం వేలాది జనం చూశారు; వాళ్ళలో కొందరు ఇప్పటికీ బతికున్నారు. ఆయన వరసగా కొన్ని రోజులపాటు నీటిమీద కూర్చుని ఉండేవారట; లేకపోతే, ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘ కాలం మరుగున ఉండేవారట. మలమలమాడే రాతి పలకలమీద, నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిశ్చలదేహం, మణికర్ణికాఘట్టంలో ఒక సామాన్య దృశ్యం.

ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగస్వామి, మానవ జీవితం, ఆక్సిజన్ మీదకాని నిశ్చిత పరిస్థితులమీదా ముందు జాగ్రత్తల మీదా కాని ఆధారపడవలసిన అవసరం లేదని మానవులకు బోధించదలిచారు. ఆయన నీళ్ళపైన ఉన్నా లోపల ఉన్నా, ఆయన శరీరం ప్రచండ సూర్యకిరణాల్ని సవాలు చేసినా, చెయ్యకపోయినా, తాము జీవించింది దివ్యచైతన్యం వల్లనే నని నిరూపించారాయన. మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది.

ఆ యోగి, ఆధ్యాత్మికంగానే కాకుండా, శారీరకంగా కూడా ఘనులే. ఆయన బరువు మూడువందల పౌన్లనుమించి ఉండేది: ఆయన జీవితంలో పానుకో ఏడాది! ఆయన తినడం అరుదు కావడంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సిద్ధపురుషుడు, మామూలు ఆరోగ్య సూత్రల్ని అన్నిటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఉపేక్షిస్తాడు; .