పుట:Oka-Yogi-Atmakatha.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

498

ఒక యోగి ఆత్మకథ

ఆడవాళ్ళిద్దరూ పటం ముందు తలవాల్చి మొక్కారు. బల్ల మీదున్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది; కాని భక్తురాళ్ళిద్దరూ చెక్కు చెదరలేదు.

“మలమలమాడ్చే ఆ వేడి నుంచి కాపాడ్డానికి, నా చుట్టూ మంచు గడ్డలు పేర్చినట్టు అనిపించింది,” అని చెప్పింది శిష్యురాలు.

అభయ అనే శిష్యురాలి విషయంలో లాహిరీ మహాశయులు రెండు అలౌకిక అద్భుతాలు చేశారు. ఆవిడా, ఆవిడ భర్తా - ఈయన కలకత్తాలో లాయరు - కలిసి గురువుగారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండడంవల్ల, వాళ్ళ బండి ఆలస్యమయింది; వాళ్ళు కలకత్తాలో హౌరా మెయిన్ స్టేషన్‌కు చేరేసరికి, కాశీకి వెళ్ళే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేస్తోంది.

టిక్కెట్ ఆఫీసు దగ్గిర అభయ ప్రశాంతంగా నించుంది.

“లాహిరీ మహాశయా, ఈ రైలు ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను!” అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. “మిమ్మల్ని చూడ్డానికి ఇంకో రోజు ఆలస్యమయితే కాచుకోడానికి పడే బాధ నేను భరించలేను.”

బుసలు కొడుతున్న ఆ ట్రెయినుకు, చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి కాని, ముందుకు సాగడమే లేదు. ఈ చిత్రం చూడడం కోసం, ఇంజినీరూ ప్రయాణికులూ ప్లాట్‌ఫారం మీదికి దిగారు. ఇంతలో, ఇంగ్లీషు రైల్వేగార్డు ఒకడు, అభయా వాళ్ళాయనా ఉన్నచోటికి వచ్చాడు. ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు, వాళ్ళకి సాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. “బాబూ, డబ్బు నా కివ్వండి. మీరు రైలెక్కుతూ ఉంటే నేను మీ టిక్కెట్లు కొని తెస్తాను” అన్నాడతను.

ఈ దంపతులు బండిలో కూర్చుని టిక్కెట్లు ఇలా అందుకున్నారో లేదో, బండి మెల్లగా ముందుకు సాగడం మొదలయింది. ఇంజినీరూ