పుట:Oka-Yogi-Atmakatha.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

497

“నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయాయి; ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటుచేశాడు.”

కాశీమణిగారు అద్భుతమైన తమ అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను.[1] ఆ మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తిన్‌కౌడి, దుకౌడి లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ చాలా గంటలసేపు ఆనందంగా గడిపాను. సాధుస్వభావులయిన వీరిద్దరూ, భారతదేశపు మహా యోగులయిన లాహిరీ మహాశయుల పుత్రులు; వీరు తండ్రిగారి ఆదర్శాల అడుగు జాడల్లోనే నడిచారు. ఇద్దరిదీ పసిమి చాయ; ఎత్తరులు, దృఢ కాయులు; బవిరి గడ్డాలూ మృదుస్వరాలూ, ఆచారవిచారాల్లో పాతకాలపు పద్ధతులూ కనిపిస్తాయి.

లాహిరీ మహాశయుల భార్య ఒక్కరే ఆయనకు శిష్యురాలు కారు; మా అమ్మతో సహా, ఇంకా కొన్ని వందలమంది ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు ఆయన ఫోటో ఒకటి కావాలని గురువుగారిని అడిగింది. ఆవిడకు ఒక కాపీ ఇస్తూ, ఆయన ఇలా అన్నారు: “దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది; లేకపోతే ఉత్తి బొమ్మే.”

ఆ తరవాత కొన్నాళ్ళకి, ఈవిడా, లాహిరీ మహాశయుల కోడలూ కలిసి భగవద్గీత చదువుతూ ఉండడం తటస్థించింది. భగవద్గీత బల్ల మీద పెట్టుకున్నారు. బల్ల వెనకాల గురువుగారి ఫొటో గోడకు వేలాడుతూ ఉంది. ఇంతలో మహా ప్రచండమైన ఉరుములూ మెరుపులతో గాలి వాన మొదలయింది; పిడుగులు పడుతున్నాయి.

“లాహిరీ మహాశయా, మమ్మల్ని రక్షించండి!” - అంటూ, ఆ

  1. ఈ పూజ్య మాతృశ్రీ 1930 మార్చి 25 న కాశీలో గతించారు.