పుట:Oka-Yogi-Atmakatha.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

484

ఒక యోగి ఆత్మకథ

“చివరికి, మృత్యుదేవత రహస్య పదవిన్యాసం నన్ను అందుకొంది,” అనుకున్నాను. కడపటి నిట్టూరుపుతో నేను అచేతన స్థితిలోకి జారిపోబోతూ ఉండగా, ఆశ్చర్యం! నేను గుర్పార్ రోడ్డులోని ఇంటి గదిలో పద్మాసనంలో కూర్చుని ఉన్నానని గమనించాను.

ఛాతీలో తుపాకిగుండు లేని శరీరాన్ని తిరిగి పొందినందుకు నేను ఆనందభరితుణ్ణయి, దాన్ని చేతులతో తట్టి, గిల్లి చూసుకుంటూ ఉంటే, నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ధారగా స్రవించాయి. నేను బతికే ఉన్నానని రూఢి చేసుకోడానికి ముందుకూ వెనక్కూ ఉయ్యాల ఊగాను; ఊపిరి పీలుస్తూ విడుస్తూ చూసుకున్నాను. నన్ను నే నిలా అభినందించుకుంటూ ఉండగా, నా చైతన్యం మళ్ళీ, రక్తసిక్తమైన సముద్ర తటాన పడిఉన్న కెప్టెన్ శవంలోకి బదిలీ అయిపోయింది. అంతా గందరగోళమయి పోయింది నా మనస్సు.

“ప్రభూ, నేను చనిపోయానా బతికున్నానా?” అంటూ ప్రార్థించాను.

కళ్ళు మిరుమిట్లు గొలిపే మహోజ్వలకాంతి ఒకటి క్షితిజమంతటా నిండింది. మృదువైన మర్మరధ్వని స్పందన ఒకటి మాటలుగా మారింది:

“బతుక్కయినా చావుకయినా కాంతితో ప్రమేయమేమిటి? నా కాంతిబింబంలో నిన్ను సృష్టించాను. చావుపుట్టుకల సాపేక్షతలు విశ్వ స్వప్నానికి చెందినవి. నీ స్వప్నాతీత సత్తను దర్శించు! మేలుకో నాయనా, మేలుకో!”

మానవుడి జాగృతిలో క్రమాభివృద్ధిగా, ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాల్ని, సరైన సమయంలో, సరైన చోట ఆవిష్కరించడానికి విజ్ఞానశాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని, దైవ