పుట:Oka-Yogi-Atmakatha.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

480

ఒక యోగి ఆత్మకథ

నాత్మక కాంతి కిరణాల్ని ఉపయోగించగలిగిన సిద్ధపురుషులు విస్మయకరమైన నిబంధనను నెరవేర్చి ఉంటారు: వారి ద్రవ్యరాశి అనంతం.

పరిపూర్ణ యోగి చైతన్యం సంకుచిత శరీరంతో కాకుండా, విశ్వ స్వరూపంతోనే అప్రయత్నంగా ఏకాత్మకమయి ఉంటుంది. గురుత్వాకర్షణ అన్నదీ, న్యూటన్ చెప్పిన “బలం” (ఫోర్స్) అయినా, ఐన్‌స్టైన్ చెప్పిన “జడత్వ ఆవిర్భావం” (మానిఫెస్టేషన్ ఆఫ్ ఇనర్షియా) అయినా భార ధర్మాన్ని ప్రదర్శించాలన్న నిర్బంధం యోగులకు విధించజాలనిది; ఇక్కడ భారదర్మమంటే, భౌతిక వస్తువులన్నిటికీ భేదాన్ని సూచించే గురుత్వాకర్షణ స్థితి. తనను తాను సర్వవ్యాపకమయిన ఆత్మగా ఎరిగిన వాడు దేశకాలాల్లోని దేహపరిమితులకు బద్ధుడై ఉండడు. ‘సో౽హం’ శక్తి ముందు బంధనాలు పటాపంచలయి పోతాయి.

“వెలుతురు ఉండుగాక! వెంటనే వెలుతురు వచ్చింది.”[1] విశ్వాన్ని సృష్టించడానికి దేవుడిచ్చిన మొదటి ఆదేశం, నిర్మాణపరంగా ఆవశ్యకమయిన కాంతిని ఆవిర్భవింపజేసింది. ఈ పదార్థేతర వాహకల తాలూకు కిరణాల మీదనే దైవసాక్షాత్కారాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవుడు జ్వాలగానూ కాంతిగానూ సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోని భక్తులూ ధ్రువపరుస్తారు. “ఆయన కళ్ళు అగ్నిజ్వాలల మాదిరిగా ఉన్నాయి,” అంటాడు సెంట్ జాన్. “...అంతే కాకుండా, ఆయన ముఖాకృతి ప్రచండ భానుతేజంలా ఉంది.”[2]

పూర్ణధ్యానం ద్వారా తన చైతన్యాన్ని సృష్టికర్తలో లయం చేసిన యోగి, జగత్సారాన్ని కాంతిగా (ప్రాణశక్తి స్పందనలుగా) దర్శి

  1. జెనిసిస్ 1-3 (బైబిలు)
  2. రివలేషన్ 1 : 14-16,