పుట:Oka-Yogi-Atmakatha.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

479

దాని ఎండమావులన్నీ విశ్లేషణలో కరిగిపోతాయి. తనకు భరోసా ఇచ్చే, భౌతిక జగత్పరమయిన ఆధారాలు ఒకదాని తరవాత ఒకటిగా తనకింద కుప్పగూలి పోతూ ఉంటే మానవుడు, తన విగ్రహారాధక ఆలంబనను- అంటే, “నేను తప్ప మరే దేవుళ్ళూ నీకు ఉండగూడదు,”[1] అన్న దైవాజ్ఞను తాను ఉల్లంఘించానన్న విషయాన్ని - అస్పష్టంగా గ్రహిస్తాడు.

ద్రవ్యరాశికీ శక్తికీ గల సమానత్వాన్ని, తన ప్రఖ్యాత సమీకరణంలో సమీక్షిస్తూ ఐన్‌స్టైన్, పదార్థంలోని ఏ ఒక్క కణంలోని శక్తి అయినా, దాని ద్రవ్యరాశిని - అంటే బరువును - కాంతివేగ వర్గంతో గుణిస్తే వచ్చే ఫలితానికి సమానమని నిరూపించాడు. పదార్థ కణాల నాశనం ద్వారానే అణుశక్తుల్ని విడుదలచెయ్యడం జరిగింది. పదార్థం “మృతి” అణుయుగానికి జన్మ ఇచ్చింది.

కాంతివేగం గణితశాస్త్రీయమైన ఒక ప్రమాణం లేదా స్థిరరాశి కావడానికి కారణం, సెకనుకు 1,86,300 మైళ్ళ వేగంలో నిరపేక్షమైన విలువ ఒకటి ఉందని కాదు; వేగంతోబాటు ద్రవ్యరాశి కూడా పెరుగుతూ ఉండే భౌతిక వస్తువు ఏదీ కూడా కాంతివేగానికి చేరుకోలేకపోవడమే దానికి కారణం. మరోరకంగా చెప్పాలంటే: ద్రవ్యరాశి అనంతంగా ఉన్న భౌతిక వస్తువు మాత్రమే కాంతి వేగానికి సమానవేగం పొందగలదు.

ఈ భావన మనల్ని, అలౌకిక ఘటనల నియమం దగ్గరికి చేరుస్తుంది.

ఇచ్చానుసారంగా తమ శరీరాల్నీ ఇతర వస్తువుల్నీ దృశ్యమానం కాని అదృశ్యంకాని చెయ్యగలిగి, కాంతివేగంతో సంచరించగలిగి, ఏ భౌతిక రూపాన్నయినా సరే తక్షణమే ప్రత్యక్షం కావించడానికి సృజ

  1. ఎక్సోడస్ 20 : 3 (బైబిలు).