పుట:Oka-Yogi-Atmakatha.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

478

ఒక యోగి ఆత్మకథ

“ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సూత్రాన్ని మొట్టమొదట 1927 లో, న్యూయార్కు నగరంలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే డా॥ క్లింటన్ డేవిన్‌సన్, డా॥ లెస్టర్ హెచ్. జెర్మర్ కనిపెట్టారు. ఎలక్ట్రాన్‌కు ద్వంద్వ ప్రకృతి ఉందనీ, కణగుణాన్ని తరంగగుణాన్నీ కూడా కనబరుస్తుందనీ వారు కనుక్కొన్నారు.[1] తరంగగుణం, ఎలక్ట్రాన్‌కు కాంతిగుణాన్నిచ్చింది. కటకం (లెన్స్) ద్వారా కాంతిని కేంద్రీకరింప జేసిన మాదిరిగానే ఎలక్ట్రాన్‌లను కూడా కేంద్రీకరింపజేసే సాధనంకోసం అన్వేషణ మొదలయింది.

“భౌతిక ప్రకృతి పరిధికంతకూ ద్వంద్వ వ్యక్తిత్వముందని నిరూపించిన, ఎలక్ట్రాన్ కున్న జెకిల్ - హైడ్ లక్షణాన్ని (ద్వంద్వ ప్రవృత్తిని) కనిపెట్టినందుకుగాను డా॥ డేవిస్‌సన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్నాడు.”

‘ది మిస్టీరియస్ యూనివర్స్’[2] (అంతుబట్టని అనంత విశ్వం) అన్న గ్రంథంలో సర్ జేమ్స్ జీన్స్, “జ్ఞాన ప్రవాహం, యాంత్రికంకాని వాస్తవంవేపు ప్రయాణిస్తోంది; ఇప్పుడు విశ్వం, ఒక గొప్ప యంత్రంలా కాక, ఒక గొప్ప భావనలా గోచరించడం మొదలవుతోంది,” అని రాశాడు.

ఈ విధంగా ఇరవయ్యో శతాబ్ది విజ్ఞానశాస్త్రం, అనాది వేదపాఠంలా ధ్వనిస్తోంది.

కనక, తప్పనిసరిగా అవసరమైతే మానవుడు, భౌతిక విశ్వమనేది ఏదీ లేదనీ దాని పడుగుపేకలే మాయ అనీ తెలిపే దార్శనిక సత్యాన్ని విజ్ఞానశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. వాస్తవమనే భ్రాంతి కలిగించే,

  1. అంటే, పదార్థమూ శక్తి రెండూ అన్నమాట.
  2. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్.