పుట:Oka-Yogi-Atmakatha.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ఒక యోగి ఆత్మకథ

వాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు: ‘అమ్మగారూ, విచిత్రమైన సాధు[1] వొకడు వచ్చాడు. “ముకుందుడి తల్లిని చూడాలి నేను” అంటున్నాడు.

“ఎంతో సరళమైన ఈ మాటలే, నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోడానికి వెళ్ళాను. ఆయన కాళ్ళకు మొక్కుతూ, నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవసాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను.

“అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బుచేసినప్పుడు, నీ కది ప్రాణాంతకమవుతుంది.”[2] తరవాత ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నా కేమీ భయం వెయ్యకపోగా, ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన:

“ఒక వెండి రక్ష రేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈ రోజు ఇవ్వను; నా మాటల్లో నిజం నీకు తెలియడానికి, ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో, దానంతట అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయేముందు, ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్దకొడుకు- అనంతుడితో చెప్పి, ఆ తరవాత


  1. సన్యాసి; సాధన చేసేవాడు లేదా ఆధ్యాత్మిక శిక్షణమార్గాన్ని అనుసరించేవాడు.
  2. తన జీవితకాలం స్వల్పమైనదన్న రహస్యజ్ఞానం అమ్మకు ఉండేదన్న సంగతి ఈ మాటలద్వారా నేను కనిపెట్టినప్పుడు, అనంతుడి పెళ్ళికి ఏర్పాట్లు అంత తొందరగా చెయ్యాలని ఆవిడ పట్టుపట్టడం ఎందుకో మొదటిసారిగా తెలుసుకున్నాను. పెళ్ళికిముందే ఆవిడ చనిపోయినా, తల్లిగా సహజంగా ఆవిడకు ఉండే కోరిక, ఆ వివాహకాండ చూడాలనే.