పుట:Oka-Yogi-Atmakatha.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

471

మైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడంకోసం వాళ్ళని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ దీవికి చేరి, వాళ్ళ దైవప్రార్థన హుందాగా లేదని చెప్పి ఆచారప్రకారంగా చేసే ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడు. తరవాత ఆ బిషప్పు ఒక నావ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ నావ వెనకాల ఉజ్జ్వల కాంతి ఒకటి వెంబడించి వస్తూండడం గమనించాడు. ఆ కాంతి దగ్గరపడేసరికి ముగ్గురు సాధువుల్నీ పోల్చాడాయన; ఆ ముగ్గురూ నావను అందుకొనే ప్రయత్నంలో, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కెరటాల మీద పరిగెత్తుతూ వస్తున్నారు.

“ ‘మీరు మాకు నేర్పిన ప్రార్థనలు మరచిపోయాం, మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగడానికి గబగబా వచ్చేశాం,’ అని అరిచారు వాళ్ళు, మత గురువు దగ్గరికి చేరగానే.

“ఆశ్చర్యచకితుడయిన మతగురువు, తల అడ్డంగా తిప్పాడు ‘ప్రియతములారా,’ అంటూ వాళ్ళని సవినయంగా సంబోధిస్తూ, “మీ పాత ప్రార్థనతోనే జీవితం కొనసాగించండి!’ అని జవాబిచ్చాడు.”

ఆ ముగ్గురు సాధువులూ నీటిమీద ఎలా నడిచారు?

క్రీస్తు, శిలువచేసిన తన శరీరాన్ని ఎలా పునరుత్థానం చేశాడు?

లాహిరీ మహాశయులూ శ్రీయుక్తేశ్వర్‌గారూ అలౌకిక చర్యలు ఎలా చేశారు?

అణుయుగావిర్భావంతో ప్రపంచ మానసపరిధి ఆకస్మికంగా విస్తరించినప్పటికీ, ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఇప్పటికి కూడా దీనికి సమాధానం లేదు. “అసంభవం” అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యం తగ్గుతోంది.

ఈ భౌతిక ప్రపంచం, సాపేక్షతాద్వంద్వతల సూత్రమనే ఒకే