పుట:Oka-Yogi-Atmakatha.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 30

అలౌకిక ఘటనల నియమం

ప్రసిద్ధ నవలా రచయిత లియో టాల్‌స్టాయ్‌[1] ‘ముగ్గురు సాధువులు’ అనే ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశాడు. ఆయన స్నేహితుడు నికొలాస్ రోరిక్, దాన్ని ఈ ప్రకారం సంక్షేపించి చెప్పాడు:

“ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు ఎంత నిరాడంబరులంటే, వాళ్ళు చేసే ఏకైక ప్రార్థన ఇలా ఉండేది: “మేము ముగ్గురం, నువ్వు ముగ్గురివి- మా మీద దయ ఉంచు!” ఈ అకృత్రిమమయిన ప్రార్థన సమయంలో గొప్ప అలౌకిక ఘటనలు జరిగాయి.

“స్థానిక మతగురువు[2] ఒకడు, ఈ ముగ్గురు సాధువులగురించి, అంగీకారయోగ్యంకాని వాళ్ళ ప్రార్థననుగురించి విన్నాడు; విధివిహిత

  1. టాల్‌స్టాయ్‌కీ మహాత్మాగాంధీకి అనేక ఆదర్శాల్లో పోలిక ఉంది. వీరిద్దరూ అహింసావిషయంమీద ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకున్నారు. “హింసను (హింసతో) ఎదుర్కోకండి” (మత్తయి 5 : 39) అన్నదాన్నే క్రీస్తు ప్రధాన బోధగా పరిగణించాడు టాల్‌స్టాయ్; హింసను, దానికి తార్కికంగా ఉపయుక్తమైన మంచితో లేదా ప్రేమతోనే “ఎదుర్కో”వాలి.
  2. ఈ కథకు చారిత్రక ఆధారం ఒకటి ఉన్నట్టు కనిపిస్తోంది; మత గురువు ఆ ముగ్గురు సాధువుల్నీ, ఆర్కేంజల్ నుంచి స్లావెట్‌స్కీ మఠానికి వెళ్ళడానికి నౌకలో ప్రయాణం చేస్తూ డ్వీయన్ నది ముఖద్వారం దగ్గర కలుసుకున్నాడని సంపాదకీయ గమనిక వల్ల తెలుస్తోంది.