పుట:Oka-Yogi-Atmakatha.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రవీంద్రనాథ్ టాగూరు, నేను విద్యాలయాల్ని పోల్చిచూడడం

469

విద్యాలయంగా వృద్ధిచెంది, అనేక దేశాల విద్యార్థులకు ఇక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.

“ఎక్కడ నిర్భయంగా ఉంటుందో మనస్సు, ఎక్కడ ఎత్తున నిలుస్తుందో శిరస్సు;
ఎక్కడ స్వేచ్ఛ ననుభవిస్తుందో జ్ఞానం;
ఇరుకిరుకు గదులపెట్టె మాదిరి అడ్డుగోడలతో ఎక్కడ ముక్కలుకాక ఉంటుందో ప్రపంచం;
మాటలు సత్యగర్భంలోంచి వెలువడేది ఎక్కడో;
అలుపెరగని పరిశ్రమ పరిపూర్ణతవేపు చేతులు చాపేది ఎక్కడో;
వివేక నిర్మల స్రవంతి, తుచ్ఛ ఆచారాల నిస్సార మరు భూమిలో దారి తప్పకుండా ఉండేది ఎక్కడో;
ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా, చర్యగా, మనస్సును నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావో;
ఆ స్వాతంత్ర్య స్వర్గసీమలో, తండ్రీ, మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని![1]
                                                                                   - రవీంద్రనాథ్ టాగూరు

  1. గీతాంజలి (మాక్మిలన్ కంపెనీ).