పుట:Oka-Yogi-Atmakatha.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రవీంద్రనాథ్ టాగూరు, నేను విద్యాలయాల్ని పోల్చిచూడడం

467

త్మక, వీరపూజా సంబంధమైన సహజాతాలు శుష్కించిపోతున్నాయి.” అన్నాను.

ఆ మహాకవి, తమ తండ్రిగారు దేవేంద్రనాథ్‌గారి గురించి ప్రేమ పురస్సరంగా చెప్పారు; శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చినవారు ఆయన.

“నాన్నగారు, సారవంతమైన ఈ భూమిని నాకు బహూకరించారు; దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం, దేవాలయం నిర్మించారు,” అని చెప్పారు రవీంద్రులు. “ఇక్కడ నా విద్యాబోధన ప్రయోగాన్ని 1901 లో, ఒక్క పదిమంది కుర్రవాళ్ళతో ప్రారంభించాను. నోబెల్ బహుమానంతో వచ్చిన ఎనిమిదివేల పౌన్ల డబ్బూ ఈ విద్యాలయ నిర్వహణకే ఖర్చయింది.”

“మహాఋషి”గా పేరొందిన దేవేంద్రనాథ్ టాగూరుగారు, అత్యంత గణనీయులైన వ్యక్తి; ఈ సంగతి ఆయన ‘ఆత్మకథ’ చదివి గ్రహించవచ్చు. మంచి పడుచు వయస్సులో ఆయన రెండేళ్ళపాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ టాగూరుగారు, ప్రజా హితంగా చేసిన దానధర్మాలవల్ల వంగదేశమంతకూ మాన్యులయారు. ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం ఉద్భవించింది. రవీంద్రులు ఒక్కరే కాదు; ఆయన బంధువులందరూ కూడా సృజనాత్మక అభివ్యక్తికి వన్నెకెక్కిన వారు. ఆయన సోదరుల కుమారులు, గగనేంద్రులూ అవనీంద్రులూ, భారతదేశపు అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోదగ్గవారు. రవీంద్రుల సోదరులు ద్విజేంద్రులు, గాఢద్రష్ట అయిన దార్శనికులు; పక్షులూ వన్యప్రాణులూ కూడా ఆయన్ని అభిమానించేవి.

ఆ రోజు రాత్రికి నన్ను అతిథిగృహంలో ఉండిపొమ్మని కోరారు రవీంద్రులు. ఆ సాయంత్రం మొగసాలలో కవీంద్రులూ తదితరుల