పుట:Oka-Yogi-Atmakatha.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

464

ఒక యోగి ఆత్మకథ

“ ‘మహాశయులారా, మీ రిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసల సుగంధ వర్షమూ, వెనకటి మీ తృణీకార దుర్గంధమూ పొందికలేకుండా కలిశాయి. నాకు నోబెల్ బహుమానం రావడానికీ మీలో ప్రశంసాశక్తులు సునిశితంకావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? నే నిప్పటికీ - వంగదేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే.’ ”

“టాగూరుగారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తా పత్రికలు ప్రకటించాయి. పొగడ్తకు లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి,” అంటూ ఇంకా చెప్పాను. “రవీంద్రుల కార్యదర్శి సి. ఎఫ్. ఆండ్రూస్[1]గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయంచేశారు; ఆండ్రూస్‌ గారు సాదాగా బెంగాలీ పంచె కట్టుకునేవారు. టాగూరుగారిని ఆయన ప్రేమ పురస్సరంగా ‘గురు దేవులు’ అని పిలిచేవారు.

“రవీంద్రులు నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కారం, నాగరికత తొణికిసలాడుతున్నాయి. ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నే నడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆయన, తాము ప్రధానంగా ప్రభావితులైనది మన పురాణేతిహాసాల వల్లా, పద్నాలుగో శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి రచనలవల్లా అని చెప్పారు.”

ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితుణ్ణి అయి, ప్రాచీన వంగగీతానికి టాగూరుగారు రూపకల్పన చేసిన, “అమారే ఏ ఘరే, అప్నార్ కరే గృహదీపథానీ జాలో” [నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు;

  1. మహాత్మాగాంధీ సన్నిహితుడైన ఆంగ్ల రచయిత, ప్రకాశకుడు.