పుట:Oka-Yogi-Atmakatha.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రవీంద్రనాథ్ టాగూరు, నేను విద్యాలయాల్ని పోల్చిచూడడం

463

పాడడం అయిన తరవాత. “ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగడానికి కారణమేమిటంటే, సాహిత్య విమర్శకులకు బుద్ధిచెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది,” అంటూ ముసిముసిగా నవ్వుకున్నాను.

బోలాకు ఆసక్తి కలిగి, ఆ వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను.

“బెంగాలీ కవిత్వంలో కొత్తశైలి ప్రవేశపెట్టినందుకు, టాగూరును పండితులు తీవ్రంగా విమర్శించారు,” అంటూ ప్రారంభించాను. “ఆయన, పండితుల హృదయాలకు ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాల్ని పట్టించుకోకుండా, వాడుక భాషాప్రయోగాలూ ప్రాచీన కావ్యభాషా ప్రయోగాలూ కలిపి రాసేశారు. పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాల్ని లెక్క చెయ్యకుండా, ఆయన పాటలు, గాఢమైన దార్శనిక సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరుస్తాయి.

పలుకుబడి గల ఒక విమర్శకుడు రవీంద్రనాథ్‌ను కించపరిచే ధోరణిలో, ‘తన కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్టకవి’ అని ఆయన్ని అన్నాడు; కాని టాగూరుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది; ఆయన తమ గీతాంజలి (ప్రార్థన గీతాలు) ని తామే ఇంగ్లీషులోకి అనువాదంచేసిన వెంటనే పాశ్చాత్య సాహితీలోకం ఆయనకు నివాళు లర్పించింది. ఒకప్పుడు ఆయన్ని విమర్శించినవాళ్ళతో సహా, ఒక రైలుబండి పట్టేటంతమంది పండితులు ఆయనకి అభినందనలు అందించడానికి శాంతి నికేతనం వెళ్ళారు.

“రవీంద్రులు, కావాలనే చాలాసేపు జాప్యంచేసి మరీ కలునుకున్నారు అతిథుల్ని. తరవాత, వాళ్ళు చేసి పొగడ్తల్ని, నిర్వికారంగా మౌనం వహించి విన్నారు. చివరికి, వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమర్శాయుధాల్ని వాళ్ళమీదికే ఎదురు తిప్పారు.