పుట:Oka-Yogi-Atmakatha.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ పునర్జన్మ, వెల్లడి

461

పేరే పెట్టారు తల్లిదండ్రులు. ఆ పసితనంలో కూడా ఆతనిలో, నా రాంచీ ప్రియశిష్యుడి పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లవాడు నన్ను చూస్తూనే ఆప్యాయత కనబరిచాడు; గతంలోని ఆకర్షణ ఇప్పుడు రెండింతలుగా పెల్లుబికింది.

చాలా ఏళ్ళ తరవాత, కిశోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు. సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్టు వివరించాడు. నే నతన్ని, హిమాలయాల్లో ఉన్న ఒక గురువుదగ్గరికి పంపించాను; పునర్జన్మ ఎత్తిన కాశీని శిష్యుడిగా స్వీకరించారాయన.