పుట:Oka-Yogi-Atmakatha.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ పునర్జన్మ, వెల్లడి

455

కాని ఆ తరవాత కొన్ని వారాలపాటు కాశీ, నన్ను గట్టిగా ఒత్తిడిచేశాడు. అతను ఆశ వదులుకునేటంతగా అధైర్యపడడం చూసి, చివరికి ఓదార్చాను.

“సరే,” నని మాట ఇచ్చాను. “పరమాత్ముడు నాకు సహాయపడితే, నిన్ను కనుక్కోడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను.”

వేసంగి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను. కాశీని నాతోబాటు తీసుకు వెళ్ళలేకపోతున్నందుకు విచారించి, నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిల్చి, ఎవరు ఎంతగా ఒప్పించడానికి పూనుకున్నా సరే, ఈ విద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలోనే ఉండమని జాగ్రత్తగా చెప్పాను. అతను కనక ఇంటికి వెళ్ళక పోయినట్లయితే రాగల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చునని ఎందుకో నాకు అనిపించింది.

నేను ఇలా వెళ్ళానో లేదో, కాశీ తండ్రి రాంచీలో దిగాడు. ఆయన తన కొడుకు సంకల్పాన్ని భగ్నంచెయ్యడానికి పదిహేను రోజుల పాటు ప్రయత్నించాడు; కాశీ, వాళ్ళమ్మని చూడ్డానికి ఒక్కసారి కలకత్తా వచ్చి నాలుగు రోజులు ఉంటే చాలు, మళ్ళీ తిరిగి రావచ్చునని చెప్పాడు. కాశీ ఒకే పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి, పోలీసుల సహాయంతో తన కొడుకును తీసుకుపోతానని చెప్పాడు. ఈ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు; విద్యాలయాన్ని గురించి ఏ దుష్ప్రచారం జరగడానికయినా తాను కారకుడు కావడం అతనికి ఇష్టం లేదు. వెళ్ళడం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు.

కొన్నాళ్ళ తరవాత నేను రాంచీకి తిరిగి వచ్చాను. కాశీని ఏ రకంగా తీసుకుపోయిందీ వినగానే నేను కలకత్తా వెళ్ళే బండి ఎక్కాను. అక్కడ ఒక గుర్రబ్బండి కట్టించుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, ఆ బండి, గంగానది మీద ఉన్న హౌరాబ్రిడ్జిని దాటిపోతూ ఉండగా నేను