పుట:Oka-Yogi-Atmakatha.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

451

“ఒక్క క్షణం స్తంభించిపోయి, ‘గురుదేవా, ఆ పని చెయ్యకండి! దయచేసి, ఆ పని చెయ్యకండి!’ అంటూ గట్టిగా అరిచాను. నా మాటలకి ఆశ్చర్యపోతూ, జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానందగారు నా వేపు చిరునవ్వు నవ్వారు. కాని ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి.

“ ‘స్వార్థపరుడివి కాకు; నా కోసం దుఃఖించకు.’ అన్నారాయన. ‘నేను చాలాకాలంగా, సంతోషంగా మీ కందరికీ సేవ చేస్తూ వచ్చాను; ఇప్పుడు దీనికి ఆనందించు; నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వప్రేమమయుడి దగ్గరికి పోతున్నాను’ అన్నారాయన. అని, ఇంకా నా చెవిలో గుసగుసలాడారు, ‘త్వరలోనే’ మళ్ళీ పుడతాను. కొద్దికాలంపాటు అనంతానందాన్ని అనుభవించిన తరవాత భూమికి తిరిగివచ్చి బాబాజీని[1] చేరతాను. నా ఆత్మ ఎప్పుడు, ఎక్కడ కొత్త శరీరాన్ని ధరించిందో నీకు త్వరలోనే తెలుస్తుంది.”

“ఆయన మళ్ళీ అరిచారు, ‘సనందన్, ఇదుగో! రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను.”

“మా ముందు సముద్రంలా కనిపించే ముఖాలవైపు చూసి చిన్నగా ఆశీర్వదించారు. తరవాత, తమ దృష్టిని జ్ఞాననేత్రం వేపు లోపలికి సారించి నిశ్చలంగా అయారు. ఆయన తన్మయస్థితిలో ధ్యానంచేస్తున్నారని విస్మిత జనసమూహం అనుకుంటూ ఉండగా, అప్పటికే ఆయన, దేహపంజరాన్ని విడిచి పెట్టేశారు; తమ ఆత్మను విశాల విశ్వాంతరాళంలోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి

  1. లాహిరీ మహాశయుల గురువులు; ఇప్పటికీ జీవించి ఉన్నారు. (33 అధ్యాయం చూడండి).