పుట:Oka-Yogi-Atmakatha.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

449

సమాధిలో స్తంభీభూతులయారు; ఆయన ముఖం విద్యుతేజస్సుతో ప్రకాశించింది, నా ప్రశ్నకు సమృద్ధిగా లభించిన సమాధాన మది!

ప్రణవానందగారి గదిలో చాలా మొక్కలూ, విత్తనాల పొట్లాలూ ఉండడం చూసి, అవి ఎందుకోసమని అడిగాను.

“నేను కాశీనుంచి శాశ్వతంగా వచ్చేశాను,” అన్నారాయన. “ఇప్పుడు హిమాలయాలకి ప్రయాణంలో ఉన్నాను. నా శిష్యుల కోసం అక్కడొక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను, ఈ విత్తనాలలో పాలకూరా మరికొన్ని కూరగాయలూ పండుతాయి. నా ప్రియశిష్యులు, ఆనందమయమైన దైవయోగంలో కాలం గడుపుతూ సాదాగా జీవిస్తారు. ఇంకేమీ అక్కర్లేదు.”

మా నాన్నగారు తమ సహాధ్యాయిని, మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు.

“ఇక రాను,” అని జవాబిచ్చారు ఆ సాధువు. “నాకు ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్ళే సంవత్సరం ఇదే ననీ, అక్కడే నేను దేహత్యాగం చేస్తాననీ లాహిరీ మహాశయులు చెప్పారు.”

ఆయన మాటలకు నా కళ్ళలో నీళ్ళు నిండాయి; కాని ఆ స్వాములవారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు. జగన్మాత ఒడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్యశిశువును తలపించారాయన. మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం దుష్ప్రభావమేమీ ప్రసరించలేదు. సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలో ఉన్నారు కాని ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకోకపోవడం కద్దు. కర్మఫల