పుట:Oka-Yogi-Atmakatha.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

437

న్మాద హవిస్సు నంతనీ, అందుకొంటుంది; కల్మష క్షాళనం జరిగి, మానవుడు పరిశుద్ధుడవుతాడు. అలంకారికంగా చెప్పాలంటే అతని ఎముకలు కోరికల కండనుంచి విడివడి, కర్మసంబంధమైన అస్థిపంజరం సూక్ష్మ క్రిమినాశకుడై న జ్ఞానసూర్యుడి కిరణాలతో క్షాళిత మవుతుంది; మరో మానవుడివల్లకాని అతని సృష్టికర్తవల్లకాని ఎటువంటి ఆపదకూ లోను కాజాలనివాడై, మానవుడు చివరికి పరిశుద్ధుడవుతాడు.