పుట:Oka-Yogi-Atmakatha.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

436

ఒక యోగి ఆత్మకథ

భగవద్గీతలో పదేపదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన “అగ్ని కార్యం” క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అసదృశుడైన దేవుడికి అర్పిస్తూ అద్వైతహోమాగ్నిలో హవనం చేస్తాడు. భూత, వర్తమాన వాంఛలన్నీ దివ్యప్రేమాగ్నిలో హుతమయే నిజమైన, యోగ సంబంధమైన అగ్నికార్యం ఇదే. ఆ పరమాగ్నిజ్వాల మానవో