పుట:Oka-Yogi-Atmakatha.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

434

ఒక యోగి ఆత్మకథ

ఉంటాడు కాని, తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేత (కర్మ) లకూ ప్రకృతికీ, లేదా పరిసరానికి కీలుబొమ్మను తప్ప మరేమీ కానని ఆలోచించుకుని (ఆ ఆలోచన కూడా రవ్వంత చాలు) అంగీకరించడు. ప్రతిమనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలూ, అనుభూతులూ, చిత్తవృత్తులూ, అలవాట్లూ వెనకటి హేతువులకు ఫలితాలే; హేతువులు ఈ జన్మలో వయినా కావచ్చు, ఏ పూర్వజన్మలోవయినా కావచ్చు. అయితే, అటువంటి ప్రభావాలన్నిటికీ అతీతంగా, సమున్నతంగా ఉంటుంది, రాజాధిరాజు సమమైన ఆత్మ. క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాల్నీ స్వాతంత్ర్యాల్నీ తిరస్కరించి మాయావరణ మంతటినీ దాటి విముక్త జీవుడవుతాడు. మానవుడు, జీవించే ఆత్మేకాని నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి; ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని నిరూపించడానికి అతనికి క్రియాయోగం ద్వారా ఒక పద్ధతి ప్రసాదించడం జరిగింది.

“బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు; ఎంచేతంటే, అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు,” అన్నారు. ఆచార్య శంకరులు, ‘శ్లోక శతకం’లో. “అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మవిచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారానూ జ్ఞానం ఉదయించదు. ‘నే నెవర్ని! ఈ జగత్తు ఎలా పుట్టింది? దీనికి కర్త ఎవరు? దీనికి భౌతిక హేతువు ఏమిటి?’ అంటూ, ఈ మాదిరిగానే విచారణ సాగాలి.”

ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు; అంచేతనే ఋషులు, ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు.

నిజమైన యోగి, తన ఆలోచనల్నీ ఇచ్ఛాశక్తిని అనుభూతుల్ని వినయ వాంఛలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి, మేరుదండ