పుట:Oka-Yogi-Atmakatha.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ఒక యోగి ఆత్మకథ

పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని [1]గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను.

“హిమాలయాలకి పారిపోదాం.” ఒక రోజున, బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు- ద్వారకా ప్రసాద్‌తో అన్నాను నేను. కాని నా మాటలకు “అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్న గారిని చూడ్డానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య, ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా, నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు.

“నీ కాషాయ వస్త్ర మేదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి! కాని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి: నే నొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి, నా పూర్వ జన్మ స్మృతులను మేల్కొలిపి ఉండవచ్చు: ఏమైనప్పటికీ, ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను.

ఒకరోజు పొద్దున, ద్వారకతో కబుర్లుచెబుతూ ఉంటే, కొండమీంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరవాత నా నోట వెలువడిన వాగ్దారను అతడు కొంతమట్టుకే శ్రద్ధగా ఆలకించాడు; కాని నేను మాత్రం, నా మాటలనే గుండెనిండుగా వింటున్నాను.

ఆవేళ మధ్యాహ్నం నేను, హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న


  1. స్వామి శబ్దానికున్న మూలార్థం, “తన ఆత్మ (స్వ)తో ఏకీభూతుడైనవాడు" అని.