పుట:Oka-Yogi-Atmakatha.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

432

ఒక యోగి ఆత్మకథ

అశాంతిపరమైన ఆలోచనలకూ నిలయమైన పార్థివ మండలానికి లాక్కు రావడం జరగనే జరగదు.

పురోభివృద్ధిచెందిన క్రియాయోగి జీవితం, పూర్వకర్మల ఫలితాల వల్లకాక, కేవలం ఆత్మ నిర్దేశాలవల్లే ప్రభావితమవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకార పూర్వకమైన మంచీ చెడూ కర్మల విలంబిత, పరిణామాత్మక ఉపదేశాల్నించి తప్పించుకుంటాడు.-- గరుడవేగ, హృదయులకు ఇవి ఆటంకాలుగా, నత్తనడకల్లా ఉంటాయి.

ఆత్మ నిర్దేశానుసార జీవనమనే ఆత్యుత్తమపద్ధతి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది, అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వ వ్యాపకత్వమనే గాఢ వాయువును ఆస్వాదిస్తాడు. దానికి భిన్నంగా, ప్రకృతి సహజమైన జీవనమనే దాస్యం అతన్ని, అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్దం చేసుకున్నప్పుడు మానవుడు, ప్రకృతినించి తొందరగా విడివడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని మనస్సునూ శాసించే నియమాల్ని ఉల్లంఘించ కుండానే అతను జీవించినప్పటికీ, అంతిమ విముక్తి పొందడాని కతనికి, మాయవేషాల్లో జన్మలెత్తుతూ పదిలక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది.

కాబట్టి, వెయ్యివేల సంవత్సరాలనగానే తిరుగుబాటు ధోరణిలో చూసేవాళ్ళకి, ఆత్మ వ్యక్తిత్వ సాధనకోసం శారీరక, మానసిక తాదాత్మ్యాల నుంచి విడివడే యోగి శీఘ్రఫలసాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చెయ్యడం జరుగుతోంది. ఆత్మ సంగతి అలా ఉంచి, కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది; అతను అసహజమైన ఎండమావుల వెంటబడి పోతూ, తన ఆలోచనలతోనూ శరీరం