పుట:Oka-Yogi-Atmakatha.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

430

ఒక యోగి ఆత్మకథ

కూడా పన్నెండు సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం; విశ్వచైతన్యావతరణకు అనువుగా మెదడనే అద్దెకొంపను పరిశుభ్రం చెయ్యాలంటే పది లక్షల సంవత్సరాలు తిరగక తప్పదు. అయితే క్రియాయోగి, ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి, అతిదీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు.

ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం, ఆయుర్దాయం పెంచడానికి చైతన్యాన్ని అనంతం వరకూ విస్తరింపజెయ్యడానికి ఉపకరిస్తుంది. ఈ యోగప్రక్రియ, మనస్సుకూ భౌతిక బంధాల్లో చిక్కుపడ్డ ఇంద్రియాలకూ మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేట్టు చేసి, భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం, శరీర కోశబంధానికికాని, ఊపిరికికాని అంటే, గాలికి ప్రకృతి భౌతిక నిర్బంధాలకూ మర్త్యమానవుడు బానిస అయి ఉండడానికి చిహ్నమైన శ్వాసకుకాని- కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. తన శరీరంమీదా మనస్సుమీదా తానే ఆధిపత్యం వహించిన వాడై, క్రియాయోగి చివరికి, “చివరి శత్రువు”[1] అయిన మృత్యువు మీద విజయం సాధిస్తాడు.

  1. “నాశనం కావలసిన చివరిశత్రువు మృత్యువు. ... 1 కోరింథియన్లు 15: 26 (బైబిలు). పరమహంస యోగానందగారి మరణానంతరం ఆయన భౌతికకాయం చెడిపోకుండా ఉండడం, ఆయన పూర్ణసిద్ధి పొందిన క్రియాయోగి అని నిరూపించింది. అయితే, చనిపోయిన తరవాత శారీరక అవినాశాన్ని మహాపురుషులందరూ ప్రదర్శించరు. అటువంటి అలౌకిక చర్యలు ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే జరుగుతాయని హిందూ పవిత్ర గ్రంధాలు చెబుతాయి. పరమహంస యోగానందగారి విషయంలో ఆ “ప్రత్యేక ప్రయోజనం” పాశ్చాత్యులు యోగశాస్త్రం విలువ తెలుసుకుని దాన్ని ఒప్పుకోడమే నన్నదాంట్లో సందేహం లేదు (ప్రచురణకర్త గమనిక)