పుట:Oka-Yogi-Atmakatha.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

429

చేస్తూ, అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నిటినీ పోషించే విశ్వశక్తి, నిద్రపోతున్న వాణ్ణి, అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది.

స్వచ్ఛందయోగి, సులువైన, సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు; నిద్రపోతున్నవాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్లు మాత్రం కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నిటినీ అక్షయ కాంతితో నింపి పరిపుష్టంకావించడానికి తద్ద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా, శ్వాసక్రియ అనవసరమయేటట్లు చేస్తాడు; అంతే కాకుండా (తన సాధన సమయాల్లో) నిద్ర, అపస్మారకం, లేదా చావువంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు.

మాయకు లోబడి, అంటే ప్రాకృతిక నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్యప్రపంచంవేపు; ఆ ప్రవాహాలు వృథా అవుతుంటాయి, ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగమవుతుంటాయి. క్రియాసాధన ఈ ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుంది; ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి, అది వెనుబాములోని సూక్ష్మశక్తులతో తిరిగి ఐక్యమయేటట్టు చెయ్యడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణం చెయ్యడంవల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్నవం చెందుతాయి.

సరయిన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా, ప్రకృతినీ దాని దివ్యప్రణాళికనూ అనుసరించి నడుచుకునే మానవులు పదిలక్షల సంవత్సరాల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా