పుట:Oka-Yogi-Atmakatha.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

425

మిస్తున్న కొద్దీ అతడు, శారీరక నిశ్చలత లేకుండానే, మమూలు జాగృత చేతనావస్థలోనూ తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు.[1]

“క్రియాయోగం, మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యడానికి ఉపకరించే సాధనం,” అని తమ శిష్యులకు వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు, “విశ్వచైతన్యరహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞానభాండారానికి భారతదేశం ప్రసాదించిన విశిష్ట, వినాశరహిత బహూకృతి ఇది. సాధారణంగా, గుండె చేసే పని కొనసాగేటట్టు చెయ్యడంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి, అంతకన్న పెద్ద పనులు చెయ్యడానికి స్వేచ్ఛ పొంది ఉండాలి; ఈ స్వేచ్ఛ పొందడానికి, నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి, నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి.

క్రియాయోగి తన ప్రాణశక్తిని, వెనుబాములోని ఆరు కేంద్రాల్ని (ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధారాలనే షట్చక్రాల్ని) చుట్టి, కిందినించి పైకి పైనించి కిందికీ పరిభమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ ఆరు చక్రాలూ విరాట్పురుషుడికి సంకేతమయిన రాశిచక్రంలోని పన్నెండు రాశులకు సమానం. మానవుడి సున్నితమయిన వెనుబాముచుట్టూ అరనిమిషంసేపు పరిభ్రమించే శక్తి, అతని పరిణామంలో సూక్ష్మప్రగతిని సాధ్యం చేస్తుంది; ఒక్క క్రియకు

  1. ‘వికల్ప’మనే సంస్కృత పదానికి ‘భేదం, తాదాత్మ్య రాహిత్యం’ అని అర్థం. సవికల్పం “భేదంతో కూడుకున్న సమాధి స్థితి,” నిర్వికల్పం “భేదం లేని” సమాధి స్థితి. అంటే సవికల్ప సమాధిలో భక్తుడు, భగవంతుడికంటె తాను భిన్నంగా ఉన్నానన్న అనుభూతి కొద్దిగా నిలుపుకొంటాడు, నిర్వికల్ప సమాధిలో ఆ పరమాత్మతో తాదాత్మ్యం అనుభవిస్తాడు.