పుట:Oka-Yogi-Atmakatha.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

ఒక యోగి ఆత్మకథ

అక్కడ, ఓడలో వైద్యుడిగా పనిచేసే డా॥ మిశ్రాగారు, కళాత్మకమైన వస్తుసామగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్ళి చూపించారు. శ్రీయుక్తేశ్వర్‌గారికీ, మా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకీ బహూకరించడంకోసం రకరకాల కానుకలు ఎంపికచేశాను. అనంతుడికోసం, ఒక వెదురు గడమీద నగిషీలు చెక్కి ఉన్న పొడుగాటి వస్తు వొకటి కొన్నాను. చైనా వాడయిన అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చీ ఇయ్యగానే నేను దాన్ని నేల మీదికి జారవిడిచి, “చచ్చిపోయిన అన్నయ్యకోసం కొన్నానిది!” అని విలపించాను.

అన్నయ్య ఆత్మ సరిగా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదల అయి అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమయిన అనుభూతి ఒకటి కలిగింది నాకు. నేను కొన్న జ్ఞాపకచిహ్నం, కింద పడ్డంవల్ల, అశుభ సూచనగా ఫళుక్కున విరిగింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, విరిగిన వెదురు ముక్కమీద ఇలా రాశాను. “ఇప్పుడే పోయిన- ప్రియమైన అనంతన్నయ్య కోసం.”

నాతో ఉన్న డాక్టరు వెటకారంగా నవ్వుతూ నన్ను గమనిస్తూనే ఉన్నాడు.

“కన్నీళ్ళు పెట్టుకోకండి. ఆయన పోయారని మీకు రూఢి అయే దాకా కన్నీళ్ళు రాల్చడమెందుకు?”

మా ఓడ కలకత్తా చేరినప్పుడు, డా॥ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు. నన్ను పలకరించడానికని, మా చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు.

“అనంతన్నయ్య ఈ జన్మ కడతేర్చుకుపోయాడని నాకు తెలుసు,”