పుట:Oka-Yogi-Atmakatha.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

405

డా॥ సి. జి. యూంగ్ చేసిన ప్రశంసలు చెప్పుకోదగ్గవి. ఏ మతపద్ధతి అయినా ‘శాస్త్రీయ’ మైనదని చెప్పుకోగలిగినప్పుడు, పశ్చిమదేశాల్లో కూడా దానికి ప్రజల ఆదరం లభిస్తుందని కచ్చితంగా నమ్మవచ్చు. యోగం, ఈ ఆశ నెరవేరుస్తుంది,” అంటాడు డా॥ యూంగ్. “కొత్తమీద కలిగే మోజు, తెలిసితెలియనివాళ్ళ వ్యామోహం సంగతి అలా ఉంచి, యోగవిద్యకు చాలామంది అనుయాయు లేర్పడడానికి మంచి కారణం ఉంది. అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుందిది; ఈ విధంగా, శాస్త్రప్రమాణానికి కావలసిన “యథార్థాల అవసరాన్ని తీరుస్తుంది; ఇంతే కాకుండా, జీవితంలో ప్రతి దశకూ వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢతలవల్లా, ప్రాచీనతవల్లా, సిద్ధాంత పద్ధతులవల్లా, ఎన్నడూ కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యంచేసి నిరూపించవచ్చు.

“మతపరంగాగాని, తాత్త్వికంగాగాని చేసే ప్రతి సాధనకూ, మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అనేదే అర్థం; అంటే అది మానసికారోగ్యశాస్త్ర పద్ధతి అన్నమాట. యోగం[1]లో చెప్పే బహువిధాలైన కేవల శరీర వ్యాయామ పద్ధతులకు కూడా శరీరారోగ్యశాస్త్రమనే అర్థం; మామూలు కసరత్తుకన్న శ్వాస ప్రశ్వాస అభ్యాసాలకన్న గొప్పదిది; ఇది కేవలం యాంత్రికం, శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్త్వికం కూడా కావడమే దానికి కారణం. శరీర, భాగాల శిక్షణలో ఇది, వాటిని సంపూర్ణాత్మతో అనుసంధానం చేస్తుందన్నది సుస్పష్టమే; ఉదాహరణకు, ప్రాణాయామ

  1. డా. యూంగ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నది ‘హఠయోగం’ గురించి. ఆరోగ్యం కోసం, దీర్ఘ ఆయుర్దాయం కోసం సాధనచేసే, శరీర భంగిమలకూ ప్రక్రియలకు సంబంధించిన ప్రత్యేక శాఖ ఇది. హఠయోగం ఉపయోగకరమైనదే. దీనివల్ల అద్భుతమైన శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. కాని ఈ యోగ విధానాన్ని ఆత్మవిమోచనకు యోగులు అరుదుగా అవలంబిస్తారు.