పుట:Oka-Yogi-Atmakatha.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

402

ఒక యోగి ఆత్మకథ

హిందూ దర్శనాలు, ఊహకు అందే సత్త్వమీమాంసాపరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అన్వేషించిన మీదట, శాశ్వత బాధానివృత్తినీ అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడే నిర్దిష్టమైన ఆరు శాస్త్రాల్ని రూపొందించాయి.

ఆరు దర్శన శాస్త్రాల్లోకీ[1] యోగసూత్రాల్లో, ప్రత్యక్ష సత్యదర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులున్నాయని, తరవాతి కాలపు ‘ఉపనిషత్తులు’ ఉద్ఘోషించాయి. ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు, ఊహాపోహాల ఊసరక్షేత్రాల్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్షీకరించుకుంటాడు.

పతంజలి యోగశాస్త్రాన్ని ‘అష్టాంగయోగ’ మంటారు. అందులో మొదటి మెట్లు: (1) యమం : నైతికవర్తన, (2) నియమం : మత ధర్మానుష్ఠానం, ఇతరుల్ని బాధ పెట్టకపోవడం (అహింస), ఎప్పుడూ సత్యాన్ని పాటించడం (సత్యం), దొంగతనం చెయ్యకపోవడం (అస్తేయం), ఇంద్రియాల్ని నిగ్రహించుకోడం (బ్రహ్మచర్యం), దేనికీ ఆశపడకపోవడం (అపరిగ్రహం) అన్నవాటితో ‘యమం’ నెరవేరుతుంది. శారీరక మానసిక పరిశుద్ధత (శౌచం), తృప్తి (సంతోషం), స్వయం శిక్షణ (తపం), పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చెయ్యడం (స్వాధ్యాయం), దేవుడి మీద భక్తి (ఈశ్వర ప్రణిధానం) ‘నియమం’ కిందికి వస్తాయి.

తరవాతి మెట్లు ఏవంటే: (3) ఆసనం (సరయిన భంగిమ): వెన్నెముకను నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా, ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి; (4) ప్రాణాయామం (సూక్ష్మమైన ప్రాణ

  1. ఆస్తిక (వేద ప్రమాణాన్ని అంగీకరించే) దర్శనాలు ఆరూ ఇవి: సాంఖ్యం, యోగం, వేదాంతం, మీమాంస, న్యాయం, వైశేషికం.