పుట:Oka-Yogi-Atmakatha.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

396

ఒక యోగి ఆత్మకథ

“నేనే ఆయన” (సో౽హం) అని కాని. అయితే శ్రీయుక్తేశ్వర్‌గారు నిరాడంబరతాప్రియులు కనక, లాంఛనప్రాయమైన కర్మకాండలన్నీ కట్టిపెట్టి, నన్నొక కొత్తపేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు.

“నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తాను,” అన్నారు చిన్నగా నవ్వుతూ.

“యోగానంద,”[1] అని చెప్పాను, ఒక్క క్షణం ఆలోచించి. ఈ పేరుకు అర్థం, “యోగం ద్వారా పొందే ఆనందం” అని.

“తథాస్తు, ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచిపెట్టేసి, ఇకనుంచి నిన్ను, సన్యాసాశ్రమ సంప్రదాయంలో ‘గిరి’ శాఖకు చెందిన యోగానందుడిగా పిలుస్తారు.”

శ్రీయుక్తేశ్వర్‌గారి ముందు నేను మోకరిల్లి, ఆయన నా కొత్త పేరు పలకడం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు, నా హృదయం కృతజ్ఞతతో పెల్లుబికిపోయింది. ఆనాటి కుర్రముకుందుడు ఒకనాటి కెప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా, ఎంత శ్రమకోర్చి హైరాణపడ్డారు! ఆనందభరితుణ్ణయి నేను, స్వామి శంకరుల (శంకరాచార్యులవారు) సుదీర్ఘ సంస్కృత స్తోత్రం [నిర్వాణ షట్కం] లోంచి కొన్ని శ్లోకాలు చదివాను[2]:

  1. “యోగానంద” అన్నది స్వాముల్లో బాగా వినిపించే పేరే.
  2. శంకరుల్ని తరచుగా శంకరాచార్యులవారని అంటారు; ఆచార్యులంటే ‘మత గురువులు’, శంకరుల కాలాన్ని గురించి పండితుల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ అద్వితీయ అద్వైతి క్రీ. పూ. ఆరో శతాబ్దిలో జీవించారని కొన్ని లిఖిత ఆధారాలు సూచిస్తాయి: ఆనందగిరి అనే ముని క్రీ. పూ. 44-12 అన్న తేదీలు ఇస్తున్నాడు; శంకరులు క్రీ. శ. ఎనిమిదో శతాబ్దంవారని పాశ్చాత్య చారిత్రకులు అంటారు. ఎన్నో యుగాల సంబంధం!