పుట:Oka-Yogi-Atmakatha.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

ఒక యోగి ఆత్మకథ

వాడు ప్రాపంచిక విషయాలగురించి ఆరాటపడతాడు; తన పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు.”[1] ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తరవాత పెళ్ళి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాల్ని నేను విడమరిచి చూశాను. వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి, గాఢంగా ధ్యానం చెయ్యాలని చేసుకున్న తీర్మానాల్ని మరిచేపోయారు.

జీవితంలో, దేవుడికి రెండోస్థానం[2] (అప్రధానమైన స్థానం) కేటాయించడమన్నది నా ఊహకు అందని విషయం. చడీ చప్పుడూ లేకుండా, జన్మజన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండాని కంతకూ ఏకైకస్వామి అయినవాడు ఆయనే. ఆ కానుకలకు ప్రతిగా మానవుడు, ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి- అది తన ప్రేమ; దాన్ని ఇవ్వడానికయినా మానడానికయినా అతనికి అధికారం ఉంది.

సృష్టిలో అణువణువునా ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచడానికి అంతులేని శ్రమ తీసుకోడంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశ్యం, ఒకే సున్నితమైన కోరిక, ఉండి ఉంటుంది- మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని. సర్వశక్తి మత్వమనే ఉక్కు పిడికిలిని నమ్రత అనే ఏ ముఖమల్ తొడుగులో మరుగుపరచలేదాయన!

ఆ మర్నాడు, నా జీవితంలో ఎన్నటికీ మరుపురాని రోజు. నాకు బాగా గుర్తు: ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం. 1915 జూలై నెల - కాలేజీలో నేను పట్టభద్రుణ్ణి అయిన కొద్దివారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం

  1. కోరింథియన్లు 7 : 32-33 (బైబిలు).
  2. “దేవుడికి రెండోస్థానం ఇచ్చేవాడు. ఆయనకు ఏ స్థానమూ ఇవ్వని వాడే”– రస్కిన్.