పుట:Oka-Yogi-Atmakatha.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

385

అన్ని రోజులూ అతనికి తీరికే అన్నట్టు, నేను వెనకాడుతూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించాడు.

“తప్పకుండా! నీకు కావలసిన సాయం చెయ్యడానికి నేను సిద్ధం,” అంటూ అతను, ఆ రోజూ, ఆ తరవాత మరికొన్ని రోజులు, గంటల తరబడి నాకు రకరకాల సబ్జెక్ట్‌లు చెప్పాడు.

“ఇంగ్లీషు సాహిత్య పరీక్షలో చాలా ప్రశ్నలు, చైల్డ్ హారాల్డ్ ప్రయాణం చేసిన దారికి సంబంధించి ఉంటాయని నా నమ్మకం,” అన్నాడు నాతో. “మనం వెంటనే అట్లాస్ ఒకటి సంపాయించాలి.”

నేను వెంటనే మా శారద బాబయ్యగారింటికి ఉరికి అట్లాసొకటి ఎరువు తెచ్చాను. బైరన్ సృష్టించిన కల్పిత కథానాయకుడు యాత్రలో సందర్శించిన ప్రదేశాల్ని యూరప్ మాప్‌లో గుర్తు పెట్టాడు రమేశ్.

అతను నాకు చదువు చెప్పగా వినడంకోసం మా సహాధ్యాయులు కొందరు చుట్టూ మూగారు. “రమేశ్ నీకు తప్పుడు సలహా ఇస్తున్నాడు,” అంటూ వ్యాఖ్యానించాడు వాళ్ళలో ఒకడు. ఒక తడవ మా చదువు పూర్తి కాగానే. “మామూలుగా, ప్రశ్నల్లో సగం మాత్రమే పుస్తకాల మీద వస్తాయి; తక్కిన సగం రచయితల జీవితాలకు సంబంధించి వస్తాయి.”

నేను ఇంగ్లీషు సాహిత్య పరీక్షకి కూర్చున్నప్పుడు, మొదటిసారిగా ప్రశ్నల మీద నా చూపు పడగానే, కృతజ్ఞతతో వెలువడ్డ కన్నీళ్ళు నా చెక్కిళ్ళ మీంచి జారిపడుతూ నా పేపరును తడిపేశాయి. క్లాస్ రూమ్ మానిటర్ నా బల్ల దగ్గరికి వచ్చి సానుభూతిగా పలకరించాడు.

“రమేశ్ నాకు సాయపడతాడని మా గురుదేవులు ముందుగానే నాకు జోస్యం చెప్పారు,” అని వివరించాను. “చూడు, రమేశ్ నాకు సూచించిన ప్రశ్నలే ఇక్కడ పరీక్షా పత్రం మీద ఉన్నాయి!” అంటూ