పుట:Oka-Yogi-Atmakatha.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

21

పట్టుకోడానికి వీలుగా, పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చేశాను.

“ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందేకాని నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ రెండో గాలిపడగ కూడా నీ దగ్గిరికివస్తే, అప్పుడు నమ్ముతాను; నీ మాట!” అంటూంటే, అక్క మాటల్లో కంటె ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజులాడుకోడంలో రెండో ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వేపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయంచేసిన నాగజెముడు మొక్కే, ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను.

"నిజమేరోయ్! అమ్మవారు నీ మాట వింటుంది! ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది!” అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తేసింది అక్క.