పుట:Oka-Yogi-Atmakatha.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాతిబొమ్మ గుండె

371

నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం, రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనమూర్తిగా ప్రత్యేకత సంతరించుకొన్నది. సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలావిగ్రహం, తరచు సజీవరూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది.

“శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి వయావు. నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలించవమ్మా?” అంటూ ప్రార్థించాను.

దివ్య ప్రశాంతితోబాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా ఐదుగంటలు గడిచిపోయాయి; నేను అంతర్‌దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానమివ్వలేదు, నేను ఒక్కరవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు, ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడు పెట్టే పరీక్ష. కాని చివరికి, తదేక నిష్ఠగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శన మిస్తాడాయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు ఏసును చూస్తాడు; హిందువు కృష్ణుణ్ణో, కాళికా దేవినో చూస్తాడు; ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడివేపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు.

నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను; మధ్యాహ్న కాలనియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థల నుంచి లేచి ముంగిట్లో అడుగు పెట్టాను. అక్కడ నేలమీద పరిచిఉన్న రాయి మిట్టమధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది; నా అరికాళ్ళ మంటెత్తిపోతున్నాయి.

“జగన్మాతా,” అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను.