పుట:Oka-Yogi-Atmakatha.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాతిబొమ్మ గుండె

369

ప్రార్థన చేశాం. అప్పటికి ఒక ఏడాదికిందట మా అక్క రమకి ‘క్రియా యోగ’ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది; దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది.

లోపలినుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. “రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నా కనిపిస్తోంది. కాని ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు బయటపెట్టకు,” అన్నాను.

అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున, రమా, వాళ్ళాయనా నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను. మా గుర్రబ్బండి అప్పర్ సర్క్యులర్ రోడ్డునుంచి దక్షిణేశ్వర్‌కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీశ్ చంద్రబోసుగారు, ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు. రమ లోప ల్లోపల ఏడుస్తోందని గమనించాను.

“అక్కయ్యా, హుషారుగా ఉండాలి నువ్వు!” అంటూ ఆమె చెవిలో గొణిగాను. “తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇయ్యకు.”

“ముకుందా, పనికిమాలిన బడాయికోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు?” అంటూ అడుగుతున్నాడు సతీశ్. “సాధువు కంటబడ్డమే నాకు వెంపరంగా ఉంటుంది. ఉంటే ఎముకలపోగు లాగయినా ఉండాడు, లేక పోతే ఏనుగ్గున్నలా బలిసిపోయయినా ఉంటాడు!”

నేను విరగబడి నవ్వాను– దీనికి సతీశ్ చిరాకుపడ్డారు. మొహం