పుట:Oka-Yogi-Atmakatha.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

19

ఉమతో నేన్నవి మామూలు మాటలే; నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కాని గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు, బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమయినప్పటికీ, కచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకరి జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్ద్వారా మచ్చపడకుండానూ తిట్లు రాకుండానూ శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్పోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరవాత నాకు అర్థమయింది.[1]

మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళికాదేవి[2] రూపంలో ఉన్న అమ్మవారి బొమ్మ ఒకటి సంపాదించాను. ఆ బొమ్మ, మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థనల్లో ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒకరోజున నేను, ఉమతోబాటు అక్కడ నించుని, ఇద్దరబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపడగల్ని గనునిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి

  1. ధ్వనికున్న అనంతమైన శక్తులు ఓం అనే సృజనాత్మక శబ్దంలోంచే ఉద్భవిస్తాయి. అణుశక్తులకన్నిటికీ వెనక ఉన్న విశ్వస్పందన శక్తి ఈ ఓంకారమే. స్పష్టమైన అవగాహనతోనూ గాఢమైన ఏకాగ్రతలోనూ పలికే ఏ మాటకైనా ఫలించే శక్తి ఉంటుంది. ఉత్తేజకరమైన మాటల్ని గట్టిగాగాని మౌనంగాగాని పునశ్చరణ చేసినట్లయితే అవి ఫలిస్తాయని మనోవైజ్ఞానిక చికిత్సకు సంబంధించిన అనేక వైద్య విధానాల్లో గమనించారు; దీని రహస్యం, మనస్సుకున్న స్పందనాల రేటును పెంచడంలో ఉంది.
  2. శాశ్వతురాలైన ప్రకృతిమాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళి.