పుట:Oka-Yogi-Atmakatha.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

ఒక యోగి ఆత్మకథ

ఈ ప్రదేశాలు రెండూ భూమిమీదున్న మనోహర ప్రదేశాలన్నిటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోతాయి.

అయినప్పటికి యెలోస్టన్ జాతీయోద్యానం, కొలరడోలోని గ్రాండ్ కాన్యాన్, అలాస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయాను. లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలూ, దాదాపు గడియారం పనిచేసేటంట క్రమబద్ధతతో, గాలిలో ఉవ్వెత్తుగా ఎగజిమ్ముతూ ఉండడం భూమిమీద, బహుశా ఒక్క యెలోస్టన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటాను. ఈ అగ్ని పర్వత ప్రాంతంలో ప్రకృతి, పూర్వసృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది: ఉష్ణగంధకం ఊటలూ, విమలక, నీలమణి వర్ణాల మడుగులూ, ఉద్ధృతమైన నీటి బుగ్గలూ, స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లూ, తోడేళ్ళూ, అడవి దున్నలూ, ఇతర వన్యప్రాణులూ అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారుకారులో ప్రయాణంచేస్తూ “డెవిల్స్ పెయింట్ పాట్” (రాకాసి రంగుల దాన) అనే, బుడగలు వచ్చే ఉడుకుడుకు బురదనేల వరకు సాగుతూ, గలగలలాడే నీటి ఊటల్నీ, ఎగిసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజీల్నీ గమనిస్తూ ఉన్నప్పుడు, యెలోస్టన్‌కున్న విశిష్టతనుబట్టి, అది ప్రత్యేక బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది.

కాలిఫోర్నియాలో యోస్‌మైట్‌లో ఉన్న పురాతన సతత హరిత శంక్వాకార వృక్షాలు రాచఠీవితో, భారీ స్తంభాలు ఆకాశంలో పై పైకి చొచ్చుకుపోతున్నట్టుగా సాగిపోతూ, దివ్యనైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడిగోపురాలు. ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ, కెనడా సరిహద్దు దగ్గర న్యూయార్కులో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏది ధీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెక్సికోలో ఉన్న కార్ల్స్‌బాడ్ కొండ