పుట:Oka-Yogi-Atmakatha.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

ఒక యోగి ఆత్మకథ

పడుతున్న ఉద్ధృత ప్రవాహాన్ని, ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి, వన్నె వన్నెల డాబాలమీంచి పారేటట్టూ, కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలమళ్ళ మధ్య కారంజీలోకి నీళ్ళు చిమ్మేటట్టూ చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలో చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తుంది. చివరికొక వనదేవతలా, దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలవలు, శ్నాప్ డ్రాగన్లు, పాన్సీలు, లావెండర్లు, గసగసాలు- ఒకటేమిటి, రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి విశాలమైన ఉద్యానవనాల్లో. చినార్, సైప్రస్, చెరీ చెట్లు తీర్చిదిద్దినట్టున్న వరసల్లో పచ్చల ఒడ్డాణం పెట్టినట్టుంటాయి; వాటి కవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి.

కాశ్మీరు ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీరులో మాకోసం ద్రాక్షపళ్ళ విందు ఎదురుచూస్తూ ఉంటుందని చెబుతూవచ్చిన రాజేంద్రుడు, అక్కడ పెద్ద ద్రాక్షతోటలేవీ అవుపడక, నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను ఆడపాతడపా వాణ్ణి దెప్పిపొడుస్తూనే వచ్చాను.

“ఓహ్, పీకలముయ్యా ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను!” అనేవాణ్ణి. కంటికి కనబడని ద్రాక్షపళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి!” ఆ తరవాత విన్నాం, తియ్య ద్రాక్షలు కాశ్మీరుకు పడమట, కాబూలులో సమృద్ధిగా పండుతాయని. చివరికి ‘రబ్డీ’ (బాగా గడ్డ కట్టించిన పాలు) తో తయారుచేసి, పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్‌క్రీమ్‌తోనే మేము సరిపెట్టుకున్నాం.

మేము ‘షికారా’లనే చిన్న పడవల్లో తిరిగాం; ఈ పడవల్లో నీడ ఇవ్వడానికి, ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సర