పుట:Oka-Yogi-Atmakatha.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

353

బండి మళ్ళీ బయల్దేరి, దుమ్ము రోడ్లమీద రొదచేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుని కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి; ఆయన నాతో అన్నారు:

“బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడీ చేస్తున్న వేమిటో చూడు.”

ఆయన చెప్పినట్లు చేశాను. ఆడీ, రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్ర్భాంతి చెందాను. క్షమార్పణ కోరుతున్నట్టుగా శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు చూశాను.

“మీరే రైటండి; ఎప్పటిలాగే. ఆడీ ప్రకృతి దృశ్యంతో బాటు దమ్ముకొడుతూ ఆనందిస్తున్నాడు.” మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు; ఆడీ కలకత్తానుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు.

నదులూ, లోయలూ, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములూ, అసంఖ్యాకమైన పర్వతశ్రేణులూ గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారిగుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రీ మే మొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వర్‌గారు, నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి కచ్చితంగా మా అసౌకర్యంకోసమే తయారై ఉన్నప్పటికీ, అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా- రోజూ రోజూకీ ఆరోగ్యం మెరుగవుతోంది.

మేము మధ్య కాశ్మీరుకు చేరువవుతూ ఉండగా, పద్మసరోవరాల దివ్యలోకం, నీటిమీద తేలే తోటలు, అందాల గుడ్డపందిళ్ళు వేసిన నావ