పుట:Oka-Yogi-Atmakatha.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

17

“నేను ఈశ్వరుణ్ణి.[1] నేను వెలుతురును.” మేఘాల ఉరుముల్లా వినిపించింది స్వరం.

“నీలో కలిసిపోవాలనుంది నాకు!”

మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో, భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. “ఆయన శాశ్వతుడు; నిత్యనూతన ఆనందరూపుడు!” ఈ పారవశ్యం కలిగిననాటి తరవాత కూడా చాలా కాలంవరకు, దీని తాలూకు స్మృతి నాలో నిలిచి పోయింది.

చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది; అక్షరాలా అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే, దాని తాలూకు మచ్చ ఈ నాటికీ నా ఒంటిమీద ఉంది. ఒకరోజు పొద్దున, నేనూ మా అక్క ఉమా, మా గోరఖ్‌పూర్ కాంపౌండ్‌లో ఒక వేపచెట్టుకింద కూర్చుని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేపపళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారి చూస్తున్నాను. మధ్యమధ్య వాటి మీదినుంచి చూపు మళ్ళించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది,

కాలిమీద కురుపువేసిందని చెప్పి ఉమ, ఆయింట్‌మెంటు సీసా


  1. విశ్వపాలకరూపంలో భగవంతుడికి ఉన్న సంస్కృత నామం; ఇది ఈశ్ అన్న ధాతువునుంచి వచ్చింది - పాలించడం అని దీనికి అర్థం. హిందువుల పవిత్ర గ్రంథాల్లో భగవంతుడికి వెయ్యి పేర్లుంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దార్శనిక అర్ధచ్ఛాయసు సూచిస్తుంది. ఎవరి సంకల్పంవల్ల లోకాలన్నీ వ్యవస్థిత చక్రక్రమాల్లో సృష్టి అవుతూ వినాశం చెందుతూ ఉంటాయో అతడే ఈశ్వరనాముడైన భగవంతుడు.